
Divine Quotes
నిన్ను నీవు సిద్దం చేసుకో
-----------------------------
నిన్ను నీవు సిద్దం చేసుకో
నీ అంతరంగంపట్ల నీవే స్పష్టమైన నిర్ణయం కలిగి ఉండు.
ఎక్కువ వ్యవహారికత లేదా వేదాంతపరమైన మాటలతో స్దితులతో సంచరించకు.
నీకోసం కొంత సమయాన్ని కేటాయించుకో,
ఆలోచనలను నిర్ములిందామనిగానీ,
అంతరంగంలో పూర్ణంగా లయమౌదామనిగానీ ఎట్టి నిర్దారణ చేయకు.
గతమును భవితవ్యమును కూడా హృదయాంతరంగపు వైభవమునకు విడిచిపెట్టు.
ఉదాశీనంగా ఉండు.
నీ అంతరంగంలోనికి మెల్లగా దృష్టిని సారించు.
అక్కడ నిలకడ చెందు.
కాస్త స్దబ్దంగా ఉండు.
నీలో ఏముంది?
ఆలోచనల అట్టడుగున ఏముంది?
నీలో నీస్వీయఅనుభవంలో ఏముంది?
నీలో నీదేహము లేదు.
నీలో ప్రపంచము లేదు.
నీలో నీవే అమూర్తమూర్తివి.
నీకు నీవే అలౌకిక మూర్తివి.
నేను ఉన్నాననే శుద్ద ఎరుక మాత్రమే నీ అనుభవము.
ఆ అనుభవపు వర్ణనఏమిటి?
వర్ణణ వివరణ ఏమిటి?
నీ అనుభవమేమిటని నీలో స్ధబ్దంగా పరిశీలించు.
నీలో నీఅంతరంగంలో నీకెవరు అడ్డు.
నీ ఆలోచనలే నీ నిర్ణయాలే అడ్డు.
ఇతరమంటూ ఏమీలేదు.
నీకు నీవే ఇతరము.
నీకు నీవే అన్యము.
నీకు నీవే అధిష్టానము కూడా.
నేను వెవరను అంటే అది నేనే.
ఆ నేను దేహము కాదు.
దేహము నేను కాదు.
నేను అని నీనుండి తోస్తున్నదేదో అది దేహము కంటే భిన్నమైనది.
ఆ భిన్నతను నీవు అర్దం చేసుకో.
అవగాహన చెందు నిన్ను నీవు సిద్దం చేసుకో,
నేను అని తోచినదేదో అది దేహమో జగమో కానేకాదు.
అది నీ నిజమైన ప్రయాణం.
నీలో నీవు మాత్రమే ఉన్నావు.
ఇది ఆలోచన కాదు.
"నేను" స్వయంభువైన భగవంతుని ధామము.
అంటే దైవము కూడా నేనుతో అనుసంధానమై ఉన్నాడు.
ఈ నేను యొక్క ధ్యాశను నీలో నిరంతరం నింపుకో అది భగవంతుడితో అనుసంధానమే.
హృదయపు అనుసంధానము పూర్ణమైన శరణాగతి యొక్క వైభవమే.
నీ మనస్సు ఎక్కడ భలహీనమౌతుందంటే.
నేను యొక్క ధ్యాశతో .
అంతేగానీ ఇతరమైన ధ్యాశవలన మనస్సు వృద్ది పొందుతుంది.
అంటే నేను దేహమును అనే ధోరణి పెరుగుతుంది.
నేను యొక్క మూలమును తధేకమైన ధ్యాశతో నింపు.
తలంపు కలిగినపుడు ప్రేమతో నేను యొక్క మూలమును తధేకమైన ధ్యాశతో నింపు.
దీనికి సమయం చూడకు.
అసహనం కలిగితే మరలా నేను యొక్క మూలమును తధేకమైన ధ్యాశతో నింపు.
నీలో నేను యొక్క మూలమును అడుగు నేను ఎవరని.
నీలో నేను అనే మూలంపై నీవు ఆవాహన అవ్వగానే ఒక శుద్ద నిర్మలత్వమును అనుభవించగలుగుతావు.
ఆ నిర్మలత్వమును అనుభూతి చెందు.
అలా అనుభూతి చెందు.
అక్కడ నిలకడ చెందు.
అదంతా నీలో శాంతి యొక్క వైభవము.
అవిశ్రాంతమైన శాంతి యొక్క కాంతివైభవమది.
అది నీవే.
ఆ శూక్ష్మతను అనుభవించు.
దానిమూలములోనికి చొరపడు.
ఆ అనంతమైన మహా నిశ్శబ్దములోనికి చోరపడు.
లోతుగా మరింత తోతుగా సహజంగా వెళ్తుండు .
యొదట ఒకరకమైన మత్తుని అనుభవిస్తావు.
ఆ మత్తులో ఎన్నో వర్ణాలున్నాయి కొన్ని వలయాలు కూడా ఉన్నాయి.
ఆధారం లేని ప్రదేశములున్నాయి.
అదంతా ఎప్పుటి కప్పుడు నూతనంగా ఉన్నాయి.
అదంతా ఒక ప్రత్యేకమైన అమరికలా ఉంటుంది.
అవన్నీ కలిగి తోలగుతూ నిర్మలత్వమును పొడచూపుతూ వినమ్రపరుస్తుండటం నేను చూసాను.
దేహాతీతమైనవి ఎన్నో అంతరంగంలో ఉన్నాయి.
వీటిపై నాకు ఎలాంటి ప్రశ్నలు కలగడం లేదు.
అయితే అదంతా ఎంతో సౌంధర్యంతో ఉన్నాయి.
అవేవీ గత జ్ఞాపకాలు కాదు.
నేను దేనికీ కల్పించను అలాగని తోలగించను
అవన్నీ అప్పీటికప్పుడు కలుగుతున్నాయి.
అనుభవానికి అందుతున్నాయి.
వాటిని తోసిపారేయలేను కానీ చూస్తున్నానంతే.
నేను కేవలం చూస్తున్నానంతే.
ఆ చూపు నిలకడగా ఉంది.
ఆ చూపుకు అనుభవం ఉంది కానీ 
ఆ అనుభవానికి ఒక రకమైనమత్తు నిలువెత్తు నిదర్శనంగా ఉంది.
ఇలా ఎందుకో నాకూ తెలియదు.
ఆ తెలియని తనమొకటి మాత్రం సదా ఉంటుంది.
అయితే క్రమంగా అదంతా సన్నగిల్లుతుంది తుదకు.
ఒక అలౌకికమైన నిశ్శబ్దం తారసపడుతూనే ఉంటుంది.
అంతా నెమ్మదిస్తూ ఉంటుంది.
అది వ్యక్తిగతమైన అభిమానము అన్నగిల్లుతున్న తరుణమని భావించవచ్చు.
ఆ మత్తులోనికి మరింతగా వెళ్తుండు.
నీదేహము దేహగతమైన వాసనలు అలౌకికమైన అనుభవపు అకృతులు అంతా అణిగి ఉండటం అనుభవమౌతుంది.
ఒక తేలిక తనమును లేదా తెలియని తనమును అనుభవమౌతుంది తుదకు.
ఈ మత్తు
అది శూన్యమైతే కాదు అదంతాపూర్ణము.
లౌకిక అలౌకిక సంయోగం అదంతా,
అమరమైన చైతన్యమదంతా.
మరలా చెబుతున్నాను అది కల్పించుకున్నది కాదు కల్ఫితమౌతుంది ఎందుకు అనేది తెలియదు.
మరలా చెబుతున్మాను అది శరీరమో లేదా మానసికమైన కల్పనో కానేకాదు.
అదంతా శుద్దమైన అమరచైతన్యమే.
అంతిమమైన ఏకత్వమే.
శుద్ద పూర్ణమే.
అది నేను యొక్క స్దితి.
ఆనందగర్బమది.
మహా నిర్వాణమది, స్వర్గరాజ్యమది.
అది మాత్రమే స్వేచ్చ అనబడుతుంది.
అంతా కూడా తుదకు సన్నగిల్లుతుంది .
అప్పుడు నేను ఉన్నాను అన్నది నీసహజమైన ప్రయాణమౌతుంది.
ఆ శుద్దప్రసన్నతే మౌనమనబడుతుంది.
కనుక నిరతరమైన లోధ్యాశవలన నేనుఉన్నాను అన్న అనుభవం " ఉండటం" అనే స్దబ్దతగా పరిణితి చెందుతుంది.
ఆ పరిణితిని మనం నేను లేదా శాంతి అనవచ్చు.
ఇది పరిణితో లేదా ప్రయత్నమనో పేర్లు నిర్ణయించకు.
ఎందువలనంటే పేర్లు దేహగతమైన అనుభవాన్ని మాత్రమే ప్రసాదించగలవు.